భారతదేశంలో కరోనాను కట్టడి చేయడానికి చాలా రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా మాస్క్ పెట్టుకోకపోతే భారీగానే ఫైన్స్ వేస్తూ ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వీకెండ్ లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉండగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. మాస్క్ పెట్టుకోని వారితో భారీ జరిమానాలు వసూలు చేస్తూ ఉన్నారు. కరోనా కట్టడికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటూ ఉంది. కరోనా వైరస్ ఉధృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఆదివారం లాక్‌డౌన్ అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 15 దాకా లాక్‌డాన్ అమల్లో ఉంటుంది.
యూపీలో మాస్క్ ధరించకుండా రెండోసారి పట్టుబడితే రూ.10,000 జరిమానా విధిస్తారని తెలిపింది. మాస్క్ లేకుండా మొదటిసారి జరిమానాను రూ.1,000 పెంచగా.. రెండో సారి దొరికితే మాత్రం 10000 రూపాయలు చెల్లించుకోవాల్సిందే. లాక్‌డౌన్ సమయంలో పారిశుధ్య, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తారు. వీక్లీ లాక్‌డౌన్‌లో భాగంగా మే 15 దాకా శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యలయాలను మూసివేస్తారు. భారతదేశంలో కొత్తగా 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 1341 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. ఇందులో 1,26,71,220 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,79,740 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,75,649కి చేరింది.