ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్.. బహుమతిగా..!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

By -  Medi Samrat
Published on : 5 Jan 2026 7:46 PM IST

ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్.. బహుమతిగా..!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాపై చర్చించారు . ప్రధానమంత్రి దార్శనికత "నూతన ఉత్తరప్రదేశ్" అభివృద్ధి ప్రయాణాన్ని శక్తివంతం చేస్తుందని, సమయాన్ని వెచ్చించి దిశానిర్దేశం చేసినందుకు మోదీకి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రామాలయం ప్రతిరూపాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ నమూనా గులాబీ రంగు మీనాకారి కళను ఉపయోగించి రూపొందించారు. దీనిని కుంజ్ బిహారీ జీ తయారు చేశారు.

Next Story