ఎల్లో అలర్ట్‌.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

By అంజి
Published on : 6 Aug 2025 7:05 AM IST

Yellow alert, IMD, heavy rains, Districts, Telangana, APnews

ఎల్లో అలర్ట్‌.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు 

అమరావతి: రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అటు తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్, మెదక్‌, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, గద్వాల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.

Next Story