ఉమ్మడి ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా

Yashwant Sinha selected as joint Opposition candidate for presidential polls. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి

By Medi Samrat  Published on  21 Jun 2022 4:45 PM IST
ఉమ్మడి ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా

త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఎంపికయ్యారు. జూన్ 27న ఉదయం 11.30 గంటలకు సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళవారం యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండి.. దేశ‌ ప్రయోజనాల కోసం పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్ర‌ప‌తి పదవికి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రతిపాదించాలని తృణ‌మూల్ కాంగ్రెస్‌ నిర్ణయించిన వెంట‌నే ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

"తృణ‌మూల్ కాంగ్రెస్ లో మమతాజీ నాకు అందించిన గౌరవం, ప్రతిష్టకు ఆమెకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు జాతీయ ప్రయోజనం కోసం, విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి నేను పార్టీ నుండి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. మమతా ఈ చర్యను ఆమోదిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను' అని యశ్వంత్ సిన్హా ట్వీట్ చేశారు.

ఎన్‌సిపి అధినేత శరద్ ఏర్పాటు చేసిన పార్లమెంటు అనుబంధ సమావేశంలో విపక్ష నేతలు యశ్వంత్ సిన్హా పేరును అంగీకరించారు. సమావేశానికి హాజరైన పార్టీలలో కాంగ్రెస్, ఎన్‌సీపీ, టీఎంసీ, సీపీఐ, సీపీఐ-ఎం, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఎంఐఎం, ఆర్జేడీ, ఏఐయూడీఎప్‌ ఉన్నాయి.

"అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రాష్ట్ర‌ప‌తి అభ్యర్థి అయినందుకు యశ్వంత్ సిన్హాను నేను అభినందించాలనుకుంటున్నాను. గొప్ప గౌరవం.. చతురత కలిగిన వ్యక్తి, మన దేశానికి ప్రాతినిధ్యం వహించే విలువలను ఖచ్చితంగా సమర్థిస్తాడని మమతా బెనర్జీ అన్నారు.

అంతకుముందు.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా ప్రతిపాదనను తిరస్కరించారు.








Next Story