బాలీవుడ్ రచయితకు బీజేపీ నేత వార్నింగ్

Won't Allow Screening Of Javed Akhtar Films Till He Apologises. బీజేపీ ఎమ్మెల్యే బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

By Medi Samrat  Published on  5 Sept 2021 5:44 PM IST
బాలీవుడ్ రచయితకు బీజేపీ నేత వార్నింగ్

బీజేపీ ఎమ్మెల్యే బాలీవుడ్‌ రచయిత జావేద్‌ అక్తర్‌ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో కూడా తాలిబాన్ల మాదిరి ఆర్‌ఎస్‌ఎస్‌ తయారైందని జావేద్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే.. జావేద్‌ అక్తర్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆయన సినిమాలు దేశంలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన రెండు చేతులెత్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తాలిబాన్లు ఏవిధంగా ఇస్లామిక్‌ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి 'హిందూ దేశ స్థాపన కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ పని చేస్తోంది' అని జావేద్‌ అక్తర్‌ శనివారం వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆందోళనలు చేపట్టారు. జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేశారు.

మహారాష్ట్రలోని ఘట్‌కోపర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ అధికార ప్రతినిధి రామ్‌ కదాం స్పందించారు. ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యలు సిగ్గు చేటు. అంతేకాకుండా బాధాకరం. సంఘ్‌, విశ్వ హిందూ పరిషత్‌ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా విశ్వసిస్తున్న కోట్లాదిమందికి ఆ వ్యాఖ్యలు బాధను కలిగించాయి. సంఘ్‌కు చెందిన వ్యక్తులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. ఆయన రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పేంత వరకు మేం అతడి సినిమాలను భారత గడ్డపై విడుదల చేయనీయం అని రామ్‌ కదాం తెలిపారు.


Next Story