గర్భవతులు అవుతున్న మహిళా ఖైదీలు

పశ్చిమ బెంగాల్ జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల దుస్థితిపై ఓ పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  10 Feb 2024 3:45 AM GMT
గర్భవతులు అవుతున్న మహిళా ఖైదీలు

పశ్చిమ బెంగాల్ జైళ్లలో ఉన్న మహిళా ఖైదీల దుస్థితిపై ఓ పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, పశ్చిమ బెంగాల్‌లోని వివిధ జైళ్లలో 196 మంది శిశువులు ఉంటున్నారని కలకత్తా హైకోర్టుకు రిట్ పిటిషన్‌లో తెలియజేశారు. జైళ్లలో రద్దీపై 2018లో సుమో మోషన్‌లో కోర్టు అమికస్ క్యూరీగా నియమితులైన న్యాయవాది తపస్ కుమార్ భంజా గురువారం కలకత్తా హెచ్‌సి ప్రధాన న్యాయమూర్తి టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్య డివిజన్ బెంచ్ ముందు తన వాదనను ఉంచారు.

పశ్చిమ బెంగాల్ జైళ్లలో మహిళా ఖైదీల దుస్థితిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కస్టడీలో ఉన్న మహిళా ఖైదీలు గర్భం దాల్చడం ఆందోళనకరమైన సమస్య అని అభిప్రాయ పడింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లల్లో 196 మంది పిల్లలు జన్మించినట్లు అంచనా. డివిజన్ బెంచ్‌కు అధ్యక్షత వహించిన చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్య ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. పరిస్థితి తీవ్రతను న్యాయమూర్తులు గుర్తించారు. గృహంలో జన్మించిన 15 మంది పిల్లలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో జైలు పాలైన మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారని.. వ్యవస్థాగత సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. మహిళా ఖైదీల హక్కులు కాపాడాలి.. వారి శ్రేయస్సును కాపాడేందుకు సమగ్ర సంస్కరణలు చేయాల్సి ఉందని తెలుస్తోంది.

Next Story