సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొదటిసారిగా వీవీఐపీల రక్షణ కోసం మహిళా దళాన్ని ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మొదటి బ్యాచ్‌లో భాగంగా 33 మంది మహిళా సిబ్బందిని ఎంపిక చేశారు. త్వరలో వీరికి 10 వారాల పాటు శిక్షణ ప్రారంభమవనుంది. వీవీఐపీల రక్షణ కోసం ఎంపికైన మహిళ దళానికి ప్రత్యేకంగా ఏకే 47 రైఫిల్స్‌ వాడటంతో పాటు రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇస్తారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదంతో తెలిపిన కొన్ని రోజుల క్రితం మహిళా సిబ్బందిని ఎంపిక చేశారు.

ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొదటగా ఆరుగురు మహిళల దళాన్ని వీవీఐపీల రక్షణ కోసం నియమించబడనున్నారు. ఆ తర్వాత అవసరంగా మహిళ దళం నియమించబడతారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళా వీవీఐపీలకు ప్రాధాన్యత కల్పించనున్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్‌షా, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి అగ్రశేణి నాయకులను కాపాడుతూ సీఆర్‌పీఫ్ సభ్యులు విధుల్లో ఉన్నారు.


అంజి

Next Story