పబ్లిక్ టాయిలెట్‌లో మహిళా పోలీస్ ఫోన్ నెంబర్ రాశాడు.. చివరికి?

Woman Phone Number Wrote in Public Toilet. ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలకు ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఏం చేస్తాం?

By Medi Samrat  Published on  26 Dec 2020 11:17 AM GMT
పబ్లిక్ టాయిలెట్‌లో మహిళా పోలీస్ ఫోన్ నెంబర్ రాశాడు.. చివరికి?

ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలకు ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఏం చేస్తాం? ఆ నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టడం చేస్తారు. లేదంటే ఆ నంబర్ నుంచి వచ్చే ఫోన్లను తీయకుండా ఉంటారు. ఇలాంటి తరహాలోనే తనతో మాట్లాడలేదని కోపంతో ఓ వ్యక్తి ఆ మహిళ పోలీస్ ఫోన్ నెంబర్ ఏకంగా ఒక పబ్లిక్ టాయిలెట్‌లో రాసిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాకు చెందిన నందిని(name changed) అనే మహిళ పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తోంది.2017 సంవత్సరంలో నందిని ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ కు చెందిన స్నేహితులందరి ఫోన్ నెంబర్లను తీసుకొని వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో తరచుగా నందిని అనే మహిళకు సతీష్ అనే ఇంటర్మీడియట్ క్లాస్మేట్ తరచూ ఫోన్ చేస్తూ ఎంతో అసభ్యకరంగా మాట్లాడేవాడు. దీంతో విసిగిపోయిన నందిని ఆ విషయం ఎవరికీ బయటకు చెప్పకుండా సతీష్ ఫోన్ లను ఎత్తకుండా, అతనితో మాట్లాడకుండా ఉండేది. దీంతో సతీష్ తనతో మాట్లాడలేదనే కోపంతో నందిని ఫోన్ నెంబర్ ను ఏకంగా చిక్కమగళూరు జిల్లాలోని కడూరు బస్టాండ్‌లోని పబ్లిక్ టాయిలెట్‌లో రాసి ఆమెపై పగ తీర్చుకున్నాడు.

పబ్లిక్ టాయిలెట్‌లో ఆమె ఫోన్ నెంబర్ ఉండటం వల్ల ఎంతోమంది ఆ నెంబర్ కి ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టారు.అసభ్యకరమైన పదజాలం వాడటంతో ఎంతో మానసిక వేదనను అనుభవించిన నందిని చివరికి తన ఫోన్ నెంబర్ కడూరు బస్టాండ్‌లోని పబ్లిక్ టాయిలెట్‌లో రాసి ఉందని తెలుసుకుంది. దీంతో డిసెంబర్ 15న తన భర్తను తీసుకువెళ్లి కడూరు బస్టాండ్‌ కు వెళ్ళింది. అక్కడ టాయిలెట్‌లో తన ఫోన్ నెంబర్ ఉండటం చూసి, ఆ నెంబర్ రాసింది తన స్నేహితుడు సతీష్ అని గుర్తించి వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సతీష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా, తన ఫోన్ కాల్స్ స్వీకరించకుండా ఉన్నందుకే తన నెంబర్ పబ్లిక్ టాయిలెట్‌లో రాసానని ఒప్పుకున్నాడు.


Next Story