కర్నాటక సీఎంపై మహిళ ముద్దుల వర్షం.. కుడిచేతిని పట్టుకుని..!

Woman kisses Karnataka CM Basavaraj Bommai hand. కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేతిని ఓ మహిళ పదే పదే ముద్దుపెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్

By అంజి  Published on  2 Nov 2021 12:16 PM IST
కర్నాటక సీఎంపై మహిళ ముద్దుల వర్షం.. కుడిచేతిని పట్టుకుని..!

కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేతిని ఓ మహిళ పదే పదే ముద్దుపెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. బెంగళూరులోని ప్యాలెస్‌ గుట్టహళ్లి ప్రాంతంలో జరిగిన జనసేవక్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ సీఎం బొమ్మై కుడి చేతిని పట్టుకుని పదే పదే ముద్దు పెట్టుకోవడం, ఆమె సీఎం చేయికి తన తలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం చేసింది. ఈ ఘటనపై మంత్రి అశ్వద్‌నారాయణ స్పందిస్తూ.. ఇది సరైన పద్ధతి కాదని ఆమెను హెచ్చరించారు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. మహిళ తన చేతిని పట్టుకోవడంపై సీఎం బొమ్మ ఒకింత ఇబ్బందికర పరిస్థితికి గురయ్యారు.

Next Story