సిబ్బందిని తిట్టింది.. సెక్యూరిటీని కొరికింది

సిబ్బందితోనూ, ఇతర ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం, గందరగోళం సృష్టించడం వంటి కారణాలతో ఓ మహిళను విమానం నుండి కిందకు దించేశారు

By Medi Samrat  Published on  18 Jun 2024 7:46 PM IST
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం 

సిబ్బందితోనూ, ఇతర ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించడం, గందరగోళం సృష్టించడం వంటి కారణాలతో ఓ మహిళను విమానం నుండి కిందకు దించేశారు. లక్నోలో విమానంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ఏకంగా భద్రతా సిబ్బంది చేతిని కొరికింది. ముంబైకి వెళ్తున్న ఆకాసా ఎయిర్‌ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

లక్నో జాయింట్ పోలీస్ కమీషనర్ ఆకాష్ కుల్హరి మాట్లాడుతూ.. మహిళ మానసిక పరిస్థితి బాగా లేదని అనుమానిస్తూ ఉన్నాం. ఆమె విమానంలో ఇతర ప్రయాణికులతో గొడవ పడిందని ఆకాష్ కుల్హరి తెలిపారు. ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో విమానంలో గందరగోళం నెలకొంది. అనంతరం మహిళను కిందకు దించేశారు. ఆమె కిందకు దిగడానికి కూడా నిరాకరించింది. బలవంతంగా విమానంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనితో కూడా గొడవపడి చేతిని కొరికింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళ మానసిక పరిస్థితి అస్థిరంగా ఉందా లేదా అనేది వైద్య పరీక్షల తర్వాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

Next Story