మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కోసం చూస్తున్న భారత్

With China factor in play, Modi govt now open to Navy’s third aircraft carrier demand. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త

By Medi Samrat  Published on  11 Dec 2020 3:55 AM GMT
మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కోసం చూస్తున్న భారత్

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో మోదీ ప్రభుత్వం భారత నేవీ కోసం మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను తీసుకుని రావాలని ప్రయత్నిస్తోంది. శాంతి.. శాంతి అని కూర్చుంటే కుదరదని పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇటీవలే చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి భారత ప్రభుత్వం ఫోకస్ మొత్తం సబ్ మెరైన్ల మీదనే ఉంది. కొత్తగా ఆరు సబ్ మెరైన్ల కోసం భారత ప్రభుత్వం ప్రతిపాదనలను ఉంచగా.. అలాగే మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను తీసుకోవాలని కూడా ప్రణాళికలు వేస్తోంది. 'పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. మొదట శాంతి గురించే ఆలోచిస్తూ ఉండే వాళ్లం.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు' ఇటీవల ప్రభుత్వ పెద్దలు చెప్పిన వ్యాఖ్యలు ఇవి. భారత్-చైనా దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ ప్రస్తుతం రష్యా నిర్మించిన 'ఐఎన్ఎస్ విక్రమాదిత్య' సేవలను వినియోగించుకుంటూ ఉండగా.. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న మరో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇంకొద్ది రోజుల్లో పూర్తీ కాబోతోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కంటే సబ్ మెరైన్స్ మీదనే దృష్టి పెడుతూ ఉంది. ఛీఫ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టాఫ్ జెనరల్ బిపిన్ రావత్ ఫిబ్రవరిలో మాట్లాడుతూ మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పూర్తీ అవ్వడానికి సమయం పడుతుందని అన్నారు. ఆయన మాటల ప్రకారం భారత నేవీకి సబ్ మెరైన్ల అవసరం ఉంది కానీ.. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల అవసరం లేదని తెలుస్తోంది. 'ఉపరితలం మీద ఉన్న ఏ వస్తువునైనా శాటిలైట్లు గమనించవచ్చు.. మిసైల్స్ ద్వారా వాటిని ధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయి' అని అన్నారు.

కానీ ప్రభుత్వం ఆలోచనా తీరులో మార్పు వస్తోంది. భవిష్యత్తులో వచ్చే అవసరాలకు అనుగుణంగా మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను తీసుకొని రావాల్సి ఉంది. భారత నేవీ కూడా అదే విషయమై ఆలోచిస్తూ ఉంది. హిందూ మహా సముద్రంలో భారత్ పైచేయి సాధించాలన్నా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అవసరం ఉందని చెబుతోంది.

నేవీ ఛీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఇటీవల మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కోసం నేవీ ప్రతిపాదనలను కేంద్రానికి పంపిందని ఆయన అన్నారు. ఇతర దేశాల నుండి టెక్నికల్ సమాచారాన్ని తీసుకుని రావాలని ప్రయత్నిస్తూ ఉన్నామని అన్నారు. మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అవసరం ఎంతైనా ఉందని.. దాని ద్వారా సముద్రప్రాంతాల్లో ఎయిర్ పవర్ అన్నది కూడా భారత్ కు పెరుగుతుందని అన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే భారత నేవీకి మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను భారత ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ రావడానికి 2033 సంవత్సరం అవుతుందని నిపుణులు చెబుతూ ఉన్నారు.

చైనా కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల విషయంలో ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంది. 2035 సంవత్సరానికి ఆరు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను సమకూర్చుకోనుంది. వాటిలో న్యూక్లియర్ దాడులు చేయగలిగే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా ఉండనున్నాయి.


Next Story
Share it