పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానుండగా..

By Medi Samrat  Published on  27 Nov 2023 6:15 AM GMT
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానుండగా.. 4వ తేదీ నుంచి సమావేశాలు జరపనున్నారు. సమావేశాలు డిసెంబర్ 22వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబర్ 2న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుండి ప్రారంభమై డిసెంబర్ 22 వరకు కొనసాగుతాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిసెంబర్ 2న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సెషన్ ప్రారంభానికి ఒక రోజు ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన "క్యాష్ ఫర్ క్వరీ" ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదికను ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ప్యానెల్ సిఫార్సు చేసిన బహిష్కరణ అమలులోకి రాకముందే సభ నివేదికను ఆమోదించాల్సి ఉంటుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మరో కీలక బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉంది.

Next Story