నేటి నుండే పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ ఈ అంశాల‌పై రచ్చ పక్కా..!

నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

By Medi Samrat  Published on  25 Nov 2024 9:38 AM IST
నేటి నుండే పార్లమెంట్ సమావేశాలు.. మళ్లీ ఈ అంశాల‌పై రచ్చ పక్కా..!

నేటి నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. వక్ఫ్ చట్టం (సవరణ) బిల్లుతో సహా పలు బిల్లులపై శాసనసభ్యులు చర్చించే అవకాశం ఉంది. మణిపూర్‌లో హింస, ఉత్తర భారతంలో వాయు కాలుష్యం, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలు వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది.

శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. అనేక బిల్లులను ప్రవేశపెట్టడం, చర్చ, ఆమోదం విషయంలో రచ్చ జరగడం పక్కా అని అంటున్నారు. సమావేశాలకి ముందు, కేంద్ర ప్రభుత్వం ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. పార్లమెంటు సజావుగా జరిగేలా అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన లంచం ఆరోపణలపై చర్చ చేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ, ఉభయ సభల సంబంధిత వ్యాపార సలహా కమిటీలు సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.

Next Story