ట్రంప్ మన ప్రధానిని కూడా కిడ్నాప్ చేస్తే..

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వింత ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది.

By -  Medi Samrat
Published on : 6 Jan 2026 8:00 PM IST

ట్రంప్ మన ప్రధానిని కూడా కిడ్నాప్ చేస్తే..

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ చేసిన వింత ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది. వెనిజులాలో ఏం జరిగిందో అది భారత్‌లో కూడా జరిగితే ఎలా అని చవాన్ ప్రశ్నించారు. ఆయన ప్రకటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

వెనిజులాలో సైనిక చర్య గురించి చవాన్ ప్రస్తావిస్తూ.. 'వెనిజులాలో జరిగినట్లే భారత్‌లోనూ జరుగుతుందా? మిస్టర్ ట్రంప్ మన ప్రధానిని కిడ్నాప్ చేస్తే? అని ప్ర‌శ్నించారు. సోషల్ మీడియా వినియోగదారులు ఆయన ప్రకటనను అసంబద్ధమైన‌దిగా పేర్కొన్నారు. చాలా మంది వినియోగదారులు చవాన్ వ్యాఖ్యను తెలివితక్కువదని అభివర్ణించారు. భారతదేశం వంటి అణుశక్తి ఉన్న‌ దేశంలో ఇలాంటి ప్రకటన చాలా అసంబద్ధమని కొందరు వినియోగదారులు అన్నారు.

గతంలో భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీపై విరుచుకుపడగా.. పృథ్వీరాజ్ చవాన్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పారు. 50 శాతం టారిఫ్‌తో వాణిజ్యం అస్సలు సాధ్యం కాదు. వాణిజ్యాన్ని ఆపడానికి సుంకాలు ఆయుధంగా ఉపయోగించబడ్డాయి. మ‌నం ఇతర మార్కెట్ల కోసం వెతకవలసి ఉంటుంది..ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు జర‌గాలి. ట్రంప్ వెనిజులాకు చేసినట్లే భారత్‌కు చేస్తే? ఎలా అని ప్ర‌శ్నించారు. చవాన్ ప్రకటనపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై బీజేపీ కూడా ఆయనపై దాడి చేసింది.

Next Story