‘విల్లుబాణం’ను చోరీ చేశారు : ఉద్ధవ్‌ థాక్రే ఆగ్రహం

Will teach thieves a lesson, be ready for polls. శివసేన అధికారిక 'విల్లు బాణం' గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం షిండే వర్గానికి ఇవ్వడంతో

By Medi Samrat  Published on  18 Feb 2023 7:16 PM IST
‘విల్లుబాణం’ను చోరీ చేశారు : ఉద్ధవ్‌ థాక్రే ఆగ్రహం

శివసేన అధికారిక 'విల్లు బాణం' గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం షిండే వర్గానికి ఇవ్వడంతో మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విల్లుబాణం’ను చోరీచేశారంటూ మహా సీఎం షిండేను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. ఉద్ధవ్‌ థాక్రే మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని.. కొందరి పక్షాన మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఇంతకు ముందు ఎప్పుడూ చేయని విధంగా పనిచేస్తోందని అన్నారు. రానున్న రోజులున్నీ మనవే.. రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని పిలుపునిచ్చారు. శివసేన గుర్తు విల్లు-బాణం’ను చోరీ చేశారు. ఈ క్రమంలో నిందితుడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము దీన్ని మండే కాగడాతో ఎదుర్కొంటామని అన్నారు.

'శివసేన' అనే పేరును, విల్లు, బాణం పార్టీ గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గం అలాగే ఉంచుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. జూన్ 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయ‌డంతో శివ‌సేన‌ పార్టీలో రెండు వర్గాలు ఉద్భవించాయి. అక్టోబర్ 2022లో.. ఎన్నికల సంఘం శివసేన విల్లు, బాణం గుర్తును స్తంభింపజేసింది. ఈసీ ఇరు వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక పేర్ల‌ను, గుర్తుల‌ను కేటాయించ‌గా థాక్రే దీనిని వ్య‌తిరేకించారు. ఈసీ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ థాక్రే ఢిల్లీ హైకోర్టును సంప్ర‌దించ‌గా కోర్టు థాక్రే అభ్య‌ర్ధ‌న‌ను తిర‌స్క‌రించింది. తాజాగా థాక్రే వ‌ర్గానికి షాక్ ఇస్తూ పార్టీ పేరును, విల్లు, బాణం గుర్తును షిండే వర్గానికి కేటాయించింది.


Next Story