ముఖ్యమంత్రిని చంపేస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే భార్య

Will shoot dead Chief Minister says PC George wife Usha. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్

By Medi Samrat  Published on  4 July 2022 1:01 PM IST
ముఖ్యమంత్రిని చంపేస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే భార్య

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ (70)ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే..! సోలార్ ప్యానెళ్ల కుంభకోణం కేసులో నిందితురాలైన మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి పదో తేదీన ఓ గెస్ట్‌హౌస్‌లో జార్జ్ తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తన ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి మేజిస్టీరియల్ కోర్టులో హాజరు పరిచారు. జార్జ్‌కు కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు.

పీసీ జార్జ్ భార్య ఉషా జార్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను వేధిస్తున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను తుపాకితో కాల్చి పారేస్తానని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టి తన భర్తను వేధిస్తున్నారని, దీని వెనక సీఎం ఉన్నారని ఆరోపించారు. సీఎం తన భర్తను, కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. సీఎం అవినీతిని బయటపెట్టినందుకే అమాయకుడైన తన భర్తపై కక్షగట్టి అరెస్ట్ చేశారని అన్నారు. తన తండ్రి రివాల్వర్‌తో సీఎంను కాల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు.

తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు జార్జ్ ఖండించారు. సోలార్ ప్యానెళ్ల కుంభకోణం కేసులో ఆమెకు మద్దతుగా స్టేట్‌మెంట్ ఇవ్వలేదన్న అక్కసుతోనే ఆమె తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందన్నారు.













Next Story