ఒక్క ఎమ్మెల్యే ఓడినా రాజకీయాల నుంచి తప్పుకుంటా

Will quit politics if a single MLA loses polls. తాను కూల్చివేసిన మహా వికాస్ అఘాడి ప్రభుత్వంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి

By Medi Samrat  Published on  15 July 2022 10:40 PM IST
ఒక్క ఎమ్మెల్యే ఓడినా రాజకీయాల నుంచి తప్పుకుంటా

తాను కూల్చివేసిన మహా వికాస్ అఘాడి ప్రభుత్వంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనతో ఉన్న‌ ఒక్క ఎమ్మెల్యే ఓడినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని శుక్రవారం ప్రకటించారు. "ఈ 50 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలుస్తారని నాకు నమ్మకం ఉంది.. వారిలో ఎవరైనా ఓడిపోతే నేను రాజకీయాలకు రాజీనామా చేస్తాను" అని షిండే తన మద్దతుదారైన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ ఏర్పాటు చేసిన‌ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు.

వచ్చే రాష్ట్ర ఎన్నికల్లో తన శివసేన, మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కలిసి 200 సీట్లు గెలుస్తాయని - లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పునరుద్ఘాటించారు. "మహా వికాస్ అఘాడి ప్రభుత్వంపై తిరుగుబాటు జరుగుతున్నప్పుడు, మొదట్లో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు, ఆపై 50 మంది శాసనసభ్యులు ఉన్నారు.. వారంతా నన్ను ప్రోత్సహించి, మద్దతిచ్చారు. కానీ నేను ఆందోళన చెందాను, నా మనస్సులో.. వారికి ఏమి జరుగుతుందో అని నేను ఆందోళన చెందాను. వారి రాజకీయ జీవితాన్ని నాకు పణంగా పెట్టారు, "అని అన్నారు.

జూన్ 20న నిశ్శబ్దంగా ప్రారంభమైన తిరుగుబాటులో మొద‌ట‌ ఎమ్మెల్యేలు గుజరాత్‌కు, తరువాత అస్సాంకు, ఆ తరువాత గోవాకు వెళ్లారు, జూన్ 30 న షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహారాష్ట్రకు తిరిగి వచ్చారు.












Next Story