కుష్బూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. అమ్మాయి పుడితే రూ. లక్ష డిపాజిట్

Will deposit Rs 1 lakh in the account of every girl child, says BJP's Khushbu Sundar. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుష్బూ.. త‌న‌ను గెలిపిస్తే.. తన నియోజకవర్గంలో అమ్మాయి పుడితే బ్యాంకులో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానని ప్రకటించారు

By Medi Samrat  Published on  28 March 2021 11:30 AM IST
కుష్బూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. అమ్మాయి పుడితే రూ. లక్ష డిపాజిట్

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారం హోరెత్తిపోతుంది. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు గెలుపు కోసం పోటీ పడుతున్నారు. హామీల‌తో ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు నేత‌లు. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుష్బూ.. త‌న‌ను గెలిపిస్తే.. తన నియోజకవర్గంలో అమ్మాయి పుడితే బ్యాంకులో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానని ప్రకటించారు.

నటి కుష్బూ చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గ‌తంలోనూ వివిధ పార్టీల నుండి ఎన్నిక‌ బ‌రిలో నిలిచిన ఆమెను విజ‌యం వ‌రించ‌లేదు. ఈ క్రమంలో ఆమె శనివారం తన నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ.. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని అన్నారు. తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే.. వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆడపిల్లలకు సహాయం అందించాలని.. తద్వారా బ్రూణ హత్యలను నివారించవచ్చని ఆమె అన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె ఓ టిఫిన్ సెంటర్ దగ్గర దోశలు వేశారు. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో కుష్బూను విజ‌యం వ‌రిస్తుందో లేదో చూడాలి.




Next Story