కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ కోరుకుంటే తాను వెనక్కి తగ్గబోనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం చెప్పారు. ఈ ఉదయం దేశ రాజధానికి చేరుకున్న గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. "నేను ఏ బాధ్యత నుండి వెనక్కి తగ్గను. ఈ సంక్షోభ సమయంలో నాకు అవసరమైన చోట, ఏ హోదాలో అయినా పార్టీకి సేవ చేస్తాను" అని ఆయన చెప్పారు. అయితే, పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
పార్టీ ఇచ్చిన అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తానని తెలిపారు. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి పదవులను ఏకకాలంలో నిర్వహించగలనని అన్నారు. తాను ఏ పదవి ఆశించడం లేదని.. అయితే ఫాసిస్ట్ (బీజేపీ) ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కృషి చేయాలని అన్నారు. ఎంపీ శశిథరూర్ కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. ఆపై కేరళలో రాహుల్ గాంధీతో కలిసి "భారత్ జోడో యాత్ర" లో పాల్గొనే అవకాశం ఉంది.