భార్య పోర్న్ చూస్తోందని.. విడాకులు మంజూరు చేయలేము

భార్య అశ్లీల చిత్రాలు చూస్తోందని విడాకులు మంజూరు చేయడం కుదరదని మద్రాస్ హై కోర్టు తీర్పు ఇచ్చింది.

By Medi Samrat
Published on : 20 March 2025 2:31 PM IST

భార్య పోర్న్ చూస్తోందని.. విడాకులు మంజూరు చేయలేము

భార్య అశ్లీల చిత్రాలు చూస్తోందని విడాకులు మంజూరు చేయడం కుదరదని మద్రాస్ హై కోర్టు తీర్పు ఇచ్చింది. మహిళలు హస్తప్రయోగం చేసుకునే హక్కును కలిగి ఉంటారని, వివాహం చేసుకున్న తర్వాత వారి లైంగిక స్వయంప్రతిపత్తిని వదులుకోరని పేర్కొంది. భారతదేశంలో స్త్రీ లైంగికత గురించి సంభాషణలు నిషిద్ధంగా పరిగణించబడుతున్నాయని, ముఖ్యంగా వివాహిత మహిళలు తమ కంటే తమ భర్తలు, పిల్లలకు ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది.

అశ్లీల చిత్రాలకు వ్యసనం సరైందని కాదని, నైతికంగా సమర్థించబడకపోయినా విడాకులకు చట్టపరమైన కారణాలు కాదని కోర్టు వాదించింది. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో విడాకులు నిషిద్ధంగా ఉన్నాయి. ప్రతి 100 వివాహాలలో ఒకటి మాత్రమే రద్దుతో ముగుస్తుంది, తరచుగా కుటుంబ, సామాజిక ఒత్తిడి కారణంగా వివాహాలను కొనసాగించడం జరుగుతుంది.

Next Story