సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, అతని కుమార్తెకు కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరు ఐసోలేషన్ లో ఉంటున్నారని సమాచారం. తన కరోనా టెస్ట్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చిందని డింపుల్ యాదవ్ చెప్పారు. ఇతరుల నుండి వేరుగా ఉంటున్నాను. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టినా యాదవ్ కోవిడ్ బారినపడ్డారు. వీరిద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయని,ప్రస్తుతం లక్నోలోని తమ నివాసంలోనే వీరు ఐసొలేట్ అయినట్లు సమాచారం. వీరిద్దరి సోకింది కోవిడ్ కొత్త వేరియంటా "ఒమిక్రాన్" అన్నది తేల్చేందుకు శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు అధికారులు.
గత కొద్ది రోజులుగా నన్ను సంప్రదించిన వారు కూడా తమ కరోనాను చెక్ చేయించుకోవాలని డింపుల్ కోరారు. వారు కూడా ఒంటరిగా ఉండాలని అభ్యర్థించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో గత 5 రోజుల్లో 128 మందికి పాజిటివ్‌గా తేలింది. 2 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా బయటకు వచ్చాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య కూడా 211 కి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 100 నుండి 200 కు పెంచుతూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఝాన్సీ, మహోబా, చిత్రకూట్ మొదలైన ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు ఉన్నాయి. కరోనా ఇన్‌ఫెక్షన్ నివారణ, చికిత్స కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.