భర్తలో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడంతో భార్య ప్రతిరోజూ భర్తతో గొడవపడేది. గొడవలు తీవ్రతరం కావడంతో భర్త మానసికంగా బాధపడుతూ ఉండేవాడు. అయితే తన భార్య ఊహించని నిర్ణయం తీసుకుంటుందని అతడు ఎప్పుడూ అనుకోలేదు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో జరిగింది. నగర్ కొత్వాలి పట్టణం సత్యప్రేమి నగర్‌కు చెందిన కౌశల్ కిషోర్ అనే 65 ఏళ్ల వ్యక్తి నాలుగేళ్ల క్రితం మధుమేహం బారిన పడ్డాడు. అప్పటినుంచి ఆయనలో లైంగిక శక్తి తగ్గుతూ వచ్చింది. భర్త అలా దూరంగా ఉండడం ఆమెకు నచ్చలేదు. భార్య ప్రతిరోజూ గొడవపడేది. సరిగ్గా అన్నం కూడా పెట్టకపోవడంతో ఆయననే వంట చేసుకుని తినేవాడు.
మంగళవారం రాత్రి భార్య తన భర్త మీద కోపాన్ని చూపించడం కోసం.. రాత్రి భోజనం చేసే సమయంలో సలసల మరుగుతున్న నూనెను తీసుకువచ్చి భర్తపై పోసింది.తల నుంచి కాలి వరకు వేడి నూనె పడడంతో వళ్లంతా కాలిపోయింది. ఆయన అరుపులు విని పక్కింటివాళ్లు పరుగెత్తుకొని వచ్చారు. స్థానికులందరూ కలిసి కిషోర్‌ను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కిషోర్ మీడియాతో మాట్లాడుతూ తమకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారంతా పనుల నిమిత్తం వేరే వేరే ప్రాంతంలో నివసిస్తున్నారన్నాడు. మధుమేహం కారణంగా తనలో లైగింక సామర్థ్యం తగ్గిపోయిందని.. భార్య మాత్రం తనను ఇన్ని రోజులూ నానా ఇబ్బందులు పెట్టి.. ఇప్పుడు ఈ కఠినమైన నిర్ణయం తీసుకుందని వాపోయాడు.