రెండేళ్ల కిందట కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అందరికి గుర్తుంది.. ఆ దాడిలో 44 మంది భద్రతా సిబ్బంది అసువులు బాసారు. వారిలో ఆర్మీ మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ ఒకరు. అప్పటికి అతనికి వివాహమై 9 నెలలు. ముష్కరుల చేతిలో తన భర్త ప్రాణాలు కోల్పోయినపుడు తాను సైన్యం లో చేరి భర్తకి నిజమైన నివాళులర్పిస్తారని అన్నారు అతని భార్య నిఖిత. ఎన్నో కష్టనష్టాలకోర్చి అతని దారిలోనే ప్రయాణించిన నిఖిత తాజాగా భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు.

నితికా కౌల్ శనివారం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించారు. అత్యంత కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆమెకు నార్తర్న్ కమాండ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి లాంఛనంగా భుజాలకు స్టార్లు అమర్చి సైన్యంలోకి తీసుకున్నారు. భర్త మరణం తరువాత ఆమె తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షను క్లియర్ చేసి సైన్యంలో చేరారు.

దేశ రక్షణ విషయంలోనే కాదు కరోనా నుంచి భద్రతా సిబ్బంది, పోలీసుల కోసం చేసే సహాయం లో కూడా నిఖిత ముందున్నారు. తన సేవింగ్స్‌ తో పాటుగా సన్నిహితులు, బంధువులు, స్నేహితులతోపాటు తెలిసిన సైనిక కుటుంబాల నుంచి కూడా డబ్బులు కూడబెట్టి ఆ మొత్తంతో మాస్కులు, పీపీఈలు, గ్లౌజుల్లాంటి భద్రతా కిట్లు కొని హరియాణా రాష్ట్రంలోని పోలీసులకు అందజేసారు. లోక్ సభ సభ్యులు గౌతమ్ గంభీర్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లతో పాటు దేశం వ్యాప్తంగా ఎంతోమంది నితికా కౌల్‌కు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు.


జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story