క్యాడ్‌బరీ ఉత్పత్తులను బహిష్కరించాలని ఎందుకు ట్రెండ్ చేస్తున్నారో తెలుసా..?

Why is Boycott Cadbury trending on Twitter. క్యాడ్‌బరీ ఉత్పత్తులను బహిష్కరించాలని పలువురు నెటిజన్లు పిలుపునిచ్చారు.

By Medi Samrat
Published on : 30 Oct 2022 5:45 PM IST

క్యాడ్‌బరీ ఉత్పత్తులను బహిష్కరించాలని ఎందుకు ట్రెండ్ చేస్తున్నారో తెలుసా..?

క్యాడ్‌బరీ ఉత్పత్తులను బహిష్కరించాలని పలువురు నెటిజన్లు పిలుపునిచ్చారు. ట్విట్టర్‌లో పలువురు క్యాడ్‌బరీ ఉత్పత్తులను వాడకండని.. చెప్పుకొచ్చారు. చాక్లెట్ బ్రాండ్ క్యాడ్‌బరీ దీపావళి సమయంలో చేసిన అడ్వర్టైజ్మెంట్ విమర్శలకు దారితీయడంతో #BoycottCadburyని ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. ఈ బ్రాండ్‌ను బాయ్‌కాట్ చేయమని పిలుపును ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా భారతదేశంలోని వినియోగదారులు క్యాడ్‌బరీకి చెందిన డెయిరీ మిల్క్‌లో బీఫ్ ఉందని ఆరోపించారు. ఉత్పత్తులు 100% శాఖాహారం అని ఆ సంస్థ స్పష్టం చేసింది.

విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకురాలు సాధ్వి ప్రాచీ.. క్యాడ్‌బరీ ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీపాలు అమ్మే వ్యక్తి పేరు అందులో 'దామోదర్' అని ఉందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తండ్రి పేరు కూడా 'దామోదర్' అని.. కావాలనే ఇలా చేశారని విమర్శించారు.



Next Story