కొత్త ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటూ అప్పుడే డిమాండ్లు..!
Why Is Arrest Charanjit Channi Trending On Twitter. పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎంపికయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల
By Medi Samrat Published on 20 Sept 2021 11:19 AM IST
పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఎంపికయ్యారు. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నూతన ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ ఏకగ్రీవంగా ఎంపికైనట్టు స్పష్టం చేశారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దవాను ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఎంపిక చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. పంజాబ్‌కు కేంద్ర పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి హరీష్ రావత్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు శనివారం నుంచి ఎమ్మెల్యేలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. మొదట సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దవా ముఖ్యమంత్రి అన్నారు.. కానీ ఆఖర్లో చరణ్ జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది కాంగ్రెస్. అయితే ట్విట్టర్ లో చరణ్ జిత్ సింగ్ ను అరెస్టు చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వకముందు ఆయన ఓ మహిళా అధికారికి పంపిన అభ్యంతకర మెసేజీలే కారణం.
అక్టోబర్ 2018 లో, చన్నీ ఒక మహిళా ఐఏఎస్ అధికారికి అభ్యంతకర సందేశాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం మహిళా అధికారి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నివేదికలు తెలిపాయి. చన్నీ తనకు మరిన్ని సందేశాలు పంపినట్లు మహిళా అధికారి ఆరోపించింది. ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అతను వాటిని పంపుతూనే ఉన్నారని తెలిసారు. అర్థరాత్రి ఒక సందేశం పంపినప్పుడు, ఆమె అభ్యంతరం చెప్పింది. ఆయన మహిళా అధికారికి ఉర్దూ కవిత్వాన్ని పంపారని ఆమె ఆరోపణలు చేసింది. అయితే ఆ తర్వాత చన్నీ క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని బయటకు తెచ్చి ముఖ్యమంత్రి పదవి నుండి ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు.