ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ను తీసుకుని రావడానికి ప్రముఖ లాయర్ నే రంగం లోకి దించారు. కేసు వాదించే బాధ్యతను హై ప్రొఫైల్ క్రిమినల్ లాయర్ సతీష్ మానెషిండేకు అప్పజెప్పారు. ప్రముఖ లాయర్ రామ్‌జెఠ్మాలనీ వద్ద ఆయన పనిచేశారు. బాలీవుడ్‌కు సంబంధించిన చాలా హైప్రొఫైల్ కేసులను ఆయనే వాదించారు. 1993లో బాంబే బ్లాస్ట్ కేసుకు సంబంధించి సంజయ్ దత్ తరఫున వాదించి బెయిల్ ఇప్పించింది ఆయనే..! 2002లో సల్మాన్ ఖాన్‌పై నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును కూడా సతీషే వాదించారు. 1998లో కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ తరఫున వాదనలు వినిపించారు.
సతీష్ మానేషిండే 56 ఏళ్ల న్యాయవాది. ఆయనకు హై ప్రొఫైల్ కేసులు కొత్త కాదు. అతను గతంలో బాలీవుడ్ తారలను మరియు వారి కుటుంబ సభ్యుల కేసులను వాదించారు. సంజయ్ దత్ చాలా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ఆ సమయంలో సతీష్ మనేషిండే బెయిల్ సంపాదించగలిగారు. ఆ కేసు ముగిసిన వెంటనే సతీష్ మానేషిండే దేశంలోని అగ్రశ్రేణి న్యాయవాదులలో ఒకడు అయ్యాడు. అతను 2002 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బెయిల్ అందించాడు. తరువాత సల్మాన్ ఖాన్ ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఇటీవల కూడా సుశాంత్ కేసులో రియా చక్రవర్తి తరపున వాదించారు ఆయన. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ ను డిఫెండ్ చేసే బాధ్యతలను తీసుకున్నారు.