భారతదేశంలో రంజాన్ 2025 మొదటి రోజును ప్రకటించారు. భారత దేశంలో నేటికీ నెలవంక కనిపించకపోవడంతో ఆదివారం నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది. భారతదేశంలో రంజాన్ ప్రారంభ తేదీని నిర్ణయించడానికి, కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఆదివారం రంజాన్ ప్రారంభం కానుండగా హైదరాబాద్, భారతదేశంలోని ఇతర నగరాల్లోని వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు పవిత్ర మాసం కోసం తమ సన్నాహాలను మొదలుపెట్టాయి. 33 ఏళ్ల విరామం తర్వాత ఈ ఏడాది వేసవి సీజన్ లో రంజాన్ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు 1992లో రంజాన్ నెల వేసవి కాలంలో ప్రారంభమైంది.