తనకు టీకా వేసిన నర్సుతో మోదీ ఏమన్నారంటే..!
What PM Narendra Modi told nurse P Niveda after the COVID-19 vaccine shot. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
By Medi Samrat
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో మొదటి డోసు టీకా వేయించుకున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. కోవిడ్-19పై పోరులో మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి చాలా గొప్పదని ఆయన అన్నారు. అర్హులందరూ వ్యాక్సీన్ వేయించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా భారతదేశాన్ని కోవిడ్-19 రహిత దేశంగా చేద్దామని అన్నారు. పీ నివేద అనే ఈ నర్సు మోదీకి వ్యాక్సిన్ వేశారు. మోదీ తనతో ఏమన్నారో ఆమె మీడియాకు తెలియజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తొలి డోసు టీకా తీసుకున్నారు. రెండవ డోసు 28 రోజుల తరువాత ఇవ్వాల్సివుంది. టీకా తీసుకున్న తరువాత మోదీ తనకు టీకా వేసినట్టే తెలియలేదని ఆమెతో అన్నారు. నర్సు నివేద పుదుచ్చేరికి నివాసి. మోదీకి టీకా వేస్తున్నప్పుడు ఆయన వెనక కేరళకు చెందిన నర్సు ఉన్నారు. ప్రధాని మోదీకి టీకా వేయడంతో దేశ వ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాతా ట్విట్టర్ ద్వారా మోదీ స్పందిస్తూ.. ఎయిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నానని చెప్పారు. కరోనాపై పోరాడుతోన్న వైద్యులు, శాస్త్రవేత్తలను ఆయన కొనియాడారు. కరోనాను అంతమొందించడానికి వారు వేగంగా కృషి చేస్తున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాలని తెలిపారు. అందరం కలిసి భారత్‌ను కరోనా రహిత దేశంగా మార్చుదామని పిలుపునిచ్చారు. అందరూ వ్యాక్సిన్ తీసుకుని ఈ లక్ష్యాన్ని ఛేదిద్దామని తెలిపారు.