తండ్రిని వ‌రించిన పద్మభూషణ్.. అదార్ పూనావాలా ఉద్వేగభరితమైన పోస్ట్..

What Adar Poonawalla Said On Father Getting Padma Bhushan. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలాను

By Medi Samrat  Published on  26 Jan 2022 7:31 AM GMT
తండ్రిని వ‌రించిన పద్మభూషణ్.. అదార్ పూనావాలా ఉద్వేగభరితమైన పోస్ట్..

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలాను పద్మభూషణ్ అవార్డుతో స‌త్క‌రించిన విష‌యం తెలిసిందే. కరోనా సంక్షోభ సమయంలో పూనావాలా చేసిన కృషికి.. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గౌరవం లభించింది. పూనావాలాకు అవార్డు ప్రకటించిన తర్వాత.. అతని కుమారుడు అదార్ పూనావాలా ఒక ఉద్వేగభరితమైన పోస్ట్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చర్చనీయాంశమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మ‌హ‌రాష్ట్ర‌కు చెందిన పది మందితో సహా 128 మందికి పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా కూడా ఉన్నారు.

కాగా, పూనావాలాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన తర్వాత ఆయన కుమారుడు అదార్ పూనావాలా తన చిన్ననాటి ఫొటోను పోస్ట్ చేస్తూ తన భావాలను వ్యక్తం చేశారు. "నేను భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నా గురువు, నా హీరో, మా నాన్న డాక్టర్ సైరస్ పూనావాలా చేసిన పనిని వారు గమనించారు'' అని అంటూ అదార్ పూనావాలా పాత ఫోటోను ట్వీట్ చేశారు. అందరికీ సమానమైన వైద్యం అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. పద్మభూషణ్ అవార్డు అందుకున్న అనంతరం సైరస్ పూనావాలా మాట్లాడుతూ.. నేను భారత ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ‌జేస్తున్నాను. ఆరోగ్యం సమాజానికి ఒక ముఖ్యమైన మూలస్తంభం. అందరికీ సమానమైన వైద్యం అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను అని ఆయన అన్నారు.


Next Story