మే 30 వరకూ లాక్‌డౌన్.. ఎక్కడంటే..
West Bengal govt announces complete lockdown from May 16-30. కోవిడ్ కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
By Medi Samrat Published on 15 May 2021 9:42 AMకోవిడ్ కేసుల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా సుమారు 13వేల మంది మరణించారు. శుక్రవారం నాడు అత్యధికంగా 20,846 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం అదనపు ఆంక్షలను ప్రకటించింది.
అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు మరియు సంస్థలు మూసివేయబడతాయి. పరిశ్రమలు, అంతరాష్ట్ర రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్ల వంటి అన్ని సేవలను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మతపరమైన సమావేశాలతో సహా అన్ని రకాల సమావేశాలపై నిషేధాజ్ఞలు విధించింది. టీ తోటలు సగం మంది తోనూ,జనపనార మిల్లులు 30 శాతం మంది కార్మికుల తోనూ నడపనున్నారు. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉదయం ఏడు నుంచి 10 గంటల వరకు అంటే 3 గంటల పాటూ దుకాణాలు తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీచేసింది. రేపు ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మార్చి నుంచి ఎనిమిది దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతికి దోహదం చేశాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పలువురు కీలక నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజలు కూడా కోవిడ్ మాటే మరచిపోయి చక్కగా మీటింగ్ లకు హాజరయ్యారు. చివరికి ఇప్పుడు కరోనా ఉదృతంగా ఉన్న రాష్ట్రల్లో ఒకటిగా చేరి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పటివరకు లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోని ప్రభుత్వం ఇకపై అదనపు ఆంక్షలపై దృష్టి పెట్టక తప్ప లేదు. అవసరమైతే లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
West Bengal govt announces complete lockdown from May 16-30 to curb COVID-19 spread
— Press Trust of India (@PTI_News) May 15, 2021