వారి కోసం మా తలుపులు తెరిచే ఉన్నాయి
We will support Kashmiri Pandits, our doors are open for them. జమ్మూ & కాశ్మీర్‌లో ఇటీవల కాశ్మీరీ పండిట్‌లను చంపడంపై మహారాష్ట్ర మంత్రి
By Medi Samrat Published on 5 Jun 2022 3:56 PM ISTజమ్మూ & కాశ్మీర్‌లో ఇటీవల కాశ్మీరీ పండిట్‌లను చంపడంపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీరీ పండిట్‌ల కోసం మా రాష్ట్ర తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయని అన్నారు. ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. "మేము వారికి (కాశ్మీరీ పండిట్లకు) మద్దతు ఇస్తాము. అక్కడ పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది. వారి కోసం మా తలుపులు తెరిచి ఉన్నాయి.
"కశ్మీర్‌లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇలాంటి సమయంలో మళ్లీ అదే పరిస్థితి పునరావృతం కావడం దురదృష్టకరమని అన్నారు. వారి భద్రతకు భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. "అక్కడ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు, మనం చూస్తున్న దృశ్యాలు బాగా లేవు" అని ఆయన అన్నారు.
ఇంతలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై ఫైర్ అయ్యారు. "కశ్మీరీ పండిట్‌ల కోసం కేంద్రం ఎటువంటి ప్రణాళికలు కలిగి లేదు" అని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన కేజ్రీవాల్, "1990 నాటి యుగం మళ్లీ వచ్చింది. వారికి ఎలాంటి ప్రణాళికలు లేవు. లోయలో హత్య జరిగినప్పుడల్లా హోంమంత్రి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశాలు చాలు.. ఇప్పుడు చర్య అవసరం అని అన్నారు.
బీజేపీ అధికారంలోకి రావడం వల్ల కాశ్మీరీ పండిట్ల వలసలు ఎప్పుడూ జరుగుతాయని కేజ్రీవాల్ ఆరోపించారు. "గత 30 ఏళ్లలో కాశ్మీర్‌లో బీజేపీ రెండుసార్లు అధికారంలో ఉంది, రెండు సార్లు కాశ్మీరీ పండిట్‌లు వలస వెళ్లాల్సి వచ్చింది" అని అన్నారు.