శునకమా.. నీకిదే మా వీడ్కోలు
Warm Farewell For Sniffer Dog In Nashik After 11 Years Of Service. పోలీసు శాఖలో స్నిఫర్ డాగ్స్ ప్రత్యేకత ఎంతగానో ఉంది.
By Medi Samrat Published on 27 Feb 2021 12:11 PM GMTపోలీసు శాఖలో స్నిఫర్ డాగ్స్ ప్రత్యేకత ఎంతగానో ఉంది. ఎందుకంటే ఎన్నో అపాయాలను ఈ శునకాలు తప్పించాయి. మనుషులు రిటైర్ అయినట్లుగానే శునకాలు కూడా రిటైర్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ శునకానికి ఘన వీడ్కోలు పలికారు పోలీసులు. పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన స్నిఫర్ డాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. 11 ఏళ్లపాటు విశేష సేవలందించిన జాగిలానికి నాసిక్ పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. 'స్నిఫర్ స్పైక్' సేవలను ప్రశంసిస్తూ గులాబీలు,బెలూన్స్‌తో డెకరేట్ చేసిన పోలీసు వాహనంపై దాన్ని ఊరేగించారు.
नाशिक पोलिसांसाठी बॉम्ब शोधण्यात तरबेज असलेला "स्निफर स्पाईक" डॉग एवढीच त्याची ओळख नव्हती! गेली ११ वर्षे तो इमानेइतबारे देशसेवा करीत होता. म्हणूनच कुटुंबातील एक सदस्य निवृत्त झाल्याच्या भावनेने पोलिसांनी त्याला असा शाही निरोप दिला. या श्वानाला माझा सलाम!@nashikpolice pic.twitter.com/7vD5kfGH8I
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) February 25, 2021
'స్నిఫర్ జాగిలం(కుక్క) మాత్రమే కాదు, పోలీసు కుటుంబంలో తను కూడా భాగమయ్యాడు. దేశం పట్ల అతడు అందించిన సేవలకు సెల్యూట్ చేస్తున్నాను' అంటూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు. ఈ స్పిఫర్ స్పైక్ గత 11 సంవత్సరాలుగా విధి నిర్వహణలో ఎన్నో పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని విచ్ఛిన్నం చేయడంలో చురుకైన పాత్ర పోషించిందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నాసిక్ పోలీసులు స్పిఫర్ సేవలను గుర్తుచేస్తూ దానికి వీడ్కోలు పలికారు.