రెండు గంటల పాటూ ఎదురు చూసిన మమతా బెనర్జీ

కోల్‌కతాలోని ఆర్‌జి కర్‌ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య నేపథ్యంలో నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను ముగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చర్చలకు పిలిచింది

By Medi Samrat  Published on  12 Sept 2024 8:45 PM IST
రెండు గంటల పాటూ ఎదురు చూసిన మమతా బెనర్జీ

కోల్‌కతాలోని ఆర్‌జి కర్‌ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య నేపథ్యంలో నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను ముగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు చర్చలకు పిలిచింది. అయితే వారి డిమాండ్ల విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో చర్చలు ముందుకు కదలలేదు. నిరసన తెలుపుతున్న వైద్యులను కలిసేందుకు తాను రెండు గంటల పాటు వేచి చూశానని, అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

సమావేశానికి మమతా బెనర్జీ హాజరు కావాలన్న వైద్యుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించగా, చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలన్న వారి డిమాండ్ ను మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది. మమతా బెనర్జీ మాట్లాడుతూ.. సమావేశాన్ని రికార్డ్ చేయడానికి పూర్తి వ్యవస్థ ఉంది. ప్రక్రియ పారదర్శకత, ఖచ్చితమైన డాక్యుమెంటేషన్ కోసం రికార్డింగ్‌ను సుప్రీంకోర్టు ఆమోదంతో పంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లైవ్ టెలికాస్ట్ గురించి మాకు కూడా ఓపెన్ మైండ్ ఉంది, అయితే కొన్ని చట్టపరమైన సమస్యలు ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. తొలుత ముఖ్యమంత్రిని కలిసేందుకు వైద్యులు సుముఖత వ్యక్తం చేశారు. 30 మందితో కూడిన బృందం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంటుందని చెప్పారు. అయితే సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలనే డిమాండ్‌ కు ప్రభుత్వం నో చెప్పడంతో వైద్యులు మమతా బెనర్జీని కలవడానికి రాలేదు.

Next Story