రోడ్డు మీద మాదకద్రవ్యాల మత్తులో యువతి.. చివరికి ఏమైందంటే..

Viral Video Of Amritsar Woman 'Under Influence Of Drugs' Prompts Probe. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మాదకద్రవ్యాల మత్తులో ఉన్న యువతికి సంబంధించిన వీడియో

By Medi Samrat
Published on : 12 Sept 2022 6:45 PM IST

రోడ్డు మీద మాదకద్రవ్యాల మత్తులో యువతి.. చివరికి ఏమైందంటే..

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మాదకద్రవ్యాల మత్తులో ఉన్న యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాలకు సంబంధించి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ వీడియో రాష్ట్రంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి ఆందోళన కలిగిస్తోంది. అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గంలోని మక్బూల్‌పురా ప్రాంతంలో ఈ వీడియో రికార్డు చేశారు. ఒక యువతి రోడ్డుపై నిలబడి, కదలడానికి ఇబ్బంది పడుతూ.. చివరికి స్పృహతప్పి పడిపోయినట్లు తెలుస్తోంది.

సిక్కుల పవిత్ర నగరమైన మక్బూల్‌పురాలో మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించిన సంఘటనల పరంగా వార్తల్లో నిలుస్తూ ఉంది. పోలీసులు ప్రారంభించిన అనేక డి-అడిక్షన్ డ్రైవ్‌లు ఆశించిన ఫలితాలను ఇవ్వడంలో విఫలమయ్యాయి. వీడియో వైరల్ కావడంతో మక్బూల్‌పురా పోలీసులు ఆదివారం స్థానికంగా పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆపరేషన్ సమయంలో, పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

దీనికి సంబంధించి పోలీసులు వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అంతేకాకుండా అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా 12 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చోరీకి గురైనట్లు అనుమానిస్తున్న ఐదు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే జీవన్‌జోత్ కౌర్ తెలిపారు.



Next Story