డీజే పాటలు ఆపారని పోలీసులపై దాడి చేసిన గ్రామస్థులు

Villagers beat up police, when DJ stopped playing. బీహార్ రాష్ట్రంలోని భోజ్ పూర్ లో డీజే పాటలు ఆపారని పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు

By Medi Samrat  Published on  14 Nov 2021 10:15 AM GMT
డీజే పాటలు ఆపారని పోలీసులపై దాడి చేసిన గ్రామస్థులు

బీహార్ రాష్ట్రంలోని భోజ్ పూర్ లో డీజే పాటలు ఆపారని పోలీసులపై గ్రామస్థులు దాడి చేశారు. భోజ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం పోలీసులకు, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. సూర్యదేవుని విగ్రహాన్ని నిమజ్జనం ఊరేగిస్తున్న ఆయూర్ గ్రామంలో ఈ గొడవ జరిగింది. నిమజ్జనం సమయంలో పెద్ద ఎత్తున డీజే పాటలు పెట్టడాన్ని పోలీసులు వద్దన్నారు. అంత సౌండ్ ఎందుకు ఆపేయాలని కోరారు పోలీసులు. దీంతో ఆగ్రహించిన స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగి రాళ్లు రువ్వారు. హింసాత్మకంగా మారిన ఈ ఘర్షణలో ఏఎస్ఐ దీపక్ కుమార్, హోంగార్డు మహేంద్ర సింగ్ సహా మొత్తం నలుగురు పోలీసులు గాయపడ్డారు. వారందరినీ స్థానిక CHC (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో చికిత్స నిమిత్తం చేర్చారు. ఈ కేసులో ఆయూర్ గ్రామంలో నివసిస్తున్న ఓం ప్రకాష్ చౌదరి, మిథిలేష్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

నిజానికి ఊరి చెరువులోనే ప్రజలు ఛత్ పూజ చేస్తారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ప్రజలు సూర్య భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఊరేగింపు చేపట్టడానికి అనుమతి తీసుకోవాల్సిన నిబంధనల గురించి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మాట్లాడారు. విగ్రహాన్ని ఇక్కడే ఉంచి చెరువులో నిమజ్జనం చేస్తాం, ఊరేగింపులు జరపడం లేదని ప్రజలు పోలీసులతో అనుమతి తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం విగ్రహ నిమజ్జనం సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున సౌండ్స్ తో ఊరేగింపు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. కొందరు పోలీసులపైనే దాడి చేశారు.


Next Story