బెంగాల్ రోడ్లపై కంగారూలు..!
Videos of kangaroos wandering in West Bengal stun netizens. కంగారూల గురించి మాట్లాడుకుంటే తప్పనిసరిగా ఆస్ట్రేలియా గురించి మాట్లాడాల్సి ఉంటుంది.
By Medi Samrat Published on 4 April 2022 9:49 AM ISTకంగారూల గురించి మాట్లాడుకుంటే తప్పనిసరిగా ఆస్ట్రేలియా గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి చాలా వరకూ అక్కడే ఉంటాయి కాబట్టి..! కంగారూల గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా, న్యూ గినియా వంటి దేశాలలో ఉంటాయని భావిస్తూ ఉంటాం. అయితే, ఈ వారాంతంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లా రోడ్లపై కంగారూలు తిరుగుతున్నట్లు చూపించే అనేక వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఈ జంతువులు వాటి సహజ ఆవాసాలకు వేల మైళ్ల దూరంలో ఉండటం సాధారణ ప్రజలనే కాకుండా అటవీ శాఖ అధికారులను కూడా ఆశ్చర్యపరిచింది. సిలిగురి పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు కంగారూలను రక్షించినట్లు అటవీశాఖ అధికారులు శనివారం విలేకరులకు తెలిపారు. చనిపోయిన కంగారూ పిల్లను కూడా కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జంతువుల స్మగ్లింగ్‌లో భాగంగా వీటిని మన దేశంలోకి తీసుకుని వచ్చారని చెబుతూ ఉన్నారు.
సీనియర్ అటవీ అధికారి మాట్లాడుతూ, "రక్షించిన తరువాత, మూడు కంగారూలను చికిత్స కోసం పంపారు. ఈ కంగారూలను ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు, ఎలా తీసుకువచ్చారు అని మేము ఆశ్చర్యపోతున్నాము." అని అన్నారు. ఈ కంగారూలను నేపాల్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నామని.. అయితే ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాము. ఆ ప్రాంతం గుండా వెళుతున్న చాలా మంది స్థానికులు ఈ జంతువులను గుర్తించారు. అలాంటి ఒక వీడియోలో, కంగారూలు పరిసరాలను పరిశీలించడం, రోడ్డుపక్కన పెరుగుతున్న గడ్డిని తినడానికి ప్రయత్నిస్తున్నాయి. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, కంగారూలు జూ నుండి పారిపోయాయా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ స్పందిస్తూ, ఈ కంగారూలు ఏ జూలోనూ భాగం కావని, అధికారులు వాటిని రక్షించారని స్పష్టం చేశారు.