భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బిసిసిఎల్) జనరల్ మేనేజర్ (జిఎం) జార్ఖండ్ పర్యటనలో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే షూలను తీసివేసి, పైజామాలను సర్దిన వీడియో వైరల్ అవ్వడంతో సరికొత్త వివాదం చెలరేగింది.
వీడియోలో కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) అనుబంధ సంస్థ BCCL GM అరిందమ్ ముస్తాఫీ, ధన్‌బాద్‌లోని ఒక భూగర్భ గనిని సందర్శించినప్పుడు కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి దూబే పైజామా డ్రాస్ట్రింగ్‌ను సర్దుతూ కనిపించారు. సోఫాలో రిలాక్స్‌గా కూర్చున్న కేంద్ర మంత్రి షూస్‌ని కూడా పక్కకు జరుపుతూ ముస్తాఫీ కనిపించారు. షూలను ఇతర అధికారులకు అందజేయడం కనిపిస్తుంది. ఈ సంఘటన అవమానకరమైన విషయమని వైరల్ వీడియోపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బిసిసిఎల్ అధికారులు తమ అవినీతిని దాచడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని, ఇటువంటి పనులు చేసి మంత్రులను సంతోషపెడుతున్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.