ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోతి సందడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వచ్చిందేనని విమానాశ్రయ వర్గాలు ధృవీకరించాయి. కోతిని రక్షించామని, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని వారు తెలిపారు. దేశీయ విమానాశ్రయంలోని ప్రీమియం ప్లాజా లాంజ్‌లోని బార్ కౌంటర్‌లో 'రియల్' ఫ్రూట్ జ్యూస్ తాగింది. బార్‌లో జూస్ తాగి, ఆహారం ఎత్తుకెళ్లింది. ఈ కోతి హల్‌చల్‌ చేయడాన్ని చుట్టూ ఉన్న ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు.

కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందీ అధికారులు తెలపలేదు. ఘటన జరిగిన సమయంలో విమానాశ్రయంలో ఉన్న ఒక ప్రయాణికుడు మాత్రం ఈ కోతి ఘటన శుక్రవారం జరిగినట్లు చెప్పారు. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. దేశీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగినట్లు సంబంధిత వర్గాలు ధృవీకరించగా, సంఘటన తేదీ మరియు సమయం ఇంకా నిర్ధారించబడలేదు. ఈ విషయంపై ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


సామ్రాట్

Next Story