మరోసారి కరోనా బారినపడ్డ వెంకయ్య నాయుడు

Vice President Venkaiah Naidu Tests Covid Positive. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు.

By Medi Samrat  Published on  23 Jan 2022 1:27 PM GMT
మరోసారి కరోనా బారినపడ్డ వెంకయ్య నాయుడు

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. ఇంతకు ముందు ఓసారి కరోనా నుంచి కోలుకున్న ఆయనకు రెండోసారి కరోనా సోకింది. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాదులోని తన నివాసంలో వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఐసోలేషన్ లో ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. వెంకయ్యనాయుడు 2020 సెప్టెంబరులోనూ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే.

"హైదరాబాద్‌లో ఉన్న ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుకు ఈరోజు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. తనను సంప్రదించిన వారందరూ ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. "అని వైస్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ ఈ రోజు ట్వీట్ చేసింది. భారతదేశంలో రోజువారీ COVID-19 వ్యాప్తి ఈ రోజు స్వల్పంగా తగ్గింది. నేడు దేశంలో 3.33 లక్షల కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటి కంటే స్వల్పంగా తక్కువ. 3.92 కోట్ల కేసులతో అమెరికా తర్వాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది.


Next Story