ప్రముఖ సీపీఎం నాయకుడు శివదాస మీనన్ కన్నుమూత‌

Veteran CPI-M leader T.Sivadasa Menon dead at 90. ప్రముఖ సీపీఎం నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి టి. శివదాస మీనన్ మంగళవారం

By Medi Samrat
Published on : 28 Jun 2022 9:37 AM

ప్రముఖ సీపీఎం నాయకుడు శివదాస మీనన్ కన్నుమూత‌

ప్రముఖ సీపీఎం నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి టి. శివదాస మీనన్ మంగళవారం కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం ఆయన వయసు 90 సంవ‌త్సరాలు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన శివదాస మీనన్ 1986లో తన ఉద్యోగాన్ని వదులుకుని పూర్తికాల రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఆయ‌న‌ పాలక్కాడ్ జిల్లాలోని మలంపుజా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు గెలిచాడు. 1987-91 మరియు 1996-2001ల‌లో రాష్ట్ర ఎక్సైజ్, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా ప‌నిచేశారు. రెండు సందర్భాల్లోనూ ఆయన ఇ.కె.నాయనార్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. మృదు స్వ‌భావిగా పేరుగాంచిన మీనన్‌ను సలహాల‌ కోసం జూనియర్ శాసనసభ్యులు ఎల్లప్పుడూ సంప్రదించేవారు. మీనన్ మ‌ర‌ణ‌వార్త తెలిసిన ప్ర‌ముఖులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు సంతాపం తెలియ‌జేస్తున్నారు.











Next Story