వరుణ్ గాంధీకి కరోనా పాజిటివ్.. బూస్టర్ డోస్ ఇవ్వండి అంటున్న ఎంపీ
Varun Gandhi tests positive for Covid. బీజేపీ నేత వరుణ్ గాంధీకి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఉత్తప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో
By Medi Samrat Published on 9 Jan 2022 5:14 PM ISTబీజేపీ నేత వరుణ్ గాంధీకి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఉత్తప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉండగా తనకు కోవిడ్ పాజిటివ్ అని తేలినట్టు ఆయన ఆదివారంనాడు ఓ ట్వీట్‌లో తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ వర్కర్లకు ముందస్తుగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆయన కోరారు. "3 రోజులు పిలిభిత్‌లో ఉన్న తర్వాత, నాకు చాలా బలమైన లక్షణాలు కనపడడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు" అని బీజేపీ ఎంపి ఆదివారం ట్వీట్ చేశారు. కరోనావైరస్ మహమ్మారి యొక్క మూడవ వేవ్ మధ్యలో ఎన్నికల ప్రచారం జరుగుతోందని అన్నారు. "ఎన్నికల కమీషన్ అభ్యర్థులు మరియు రాజకీయ నాయకులకు కూడా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ ను ఇవ్వాలి" అని ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు.
కరోనా బారిన పడిన పలువురు రాజకీయ నాయకుల్లో వరుణ్ గాంధీ కూడా ఒకరు. పంజాబ్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో సుడిగాలి ఎన్నికల ప్రచారం మధ్య ఈ నెల ప్రారంభంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోవిడ్ -19 పాజిటివ్ గా పరీక్షించినట్లు ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సైతం కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. దేశం లోని పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతూ ఉన్నారు.
ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. కోవిడ్-19 కేసుల పెరుగుదల మరియు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి మధ్య జనవరి 15 వరకు రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సమయాన్ని ఒక గంట పొడిగించాలని కూడా కమిషన్ నిర్ణయించింది.