ఉత్తరప్రదేశ్‌లోని 16000 మదర్సాలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. వాటి నిర్వహణకు సంబంధించిన 20044 నాటి చట్టం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. మదర్సా చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. విద్యా సంస్థలు స్థాపించి, నిర్వహించే మైనార్టీల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం 2004లో కూడా ఇందుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయంది. ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 17 లక్షల మంది మదర్సా విద్యార్థులకు భారీ ఊరటనిస్తూ, మదర్సా విద్యా చట్టం 2004 రాజ్యాంగబద్ధమైన చెల్లుబాటును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది.
ఇది లౌకికవాద సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆ చట్టాన్ని కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వును రద్దు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం మదర్సా విద్యా చట్టం 2004ను "రాజ్యాంగ విరుద్ధం" అని కొట్టివేస్తూ మార్చి 22న హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. "మేము యూపీ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ యొక్క చెల్లుబాటును సమర్థించాము. ఒక రాష్ట్రానికి శాసనసభ సామర్థ్యం లోపిస్తే చట్టాన్ని కొట్టివేయవచ్చు" అని బెంచ్ పేర్కొంది.