ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 18న ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఆయన భార్య, కుమారైకు కూడా కొవిడ్ భారిన పడ్డారు. వారందరూ హోం క్వాంరటటైన్‌లో ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోగా.. విషమించింది. దీంతో ఆయన్ను నిన్న రాత్రి డెహ్రాడైన్‌లోని డూన్ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు డూన్ ఆసుపత్రిలో కొవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగున్న దృష్ట్యా ప్రభుత్వం కరోనా గైడ్‌లైన్స్ కఠినంగా అమలు చేసే పనిలో పడింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అని ప్రచారం చేస్తోంది. వేడుకలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.