ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జారీ చేయబడిన ప్రభుత్వ నోటిఫికేషన్‌లు, గెజిట్ నోటిఫికేషన్‌లు, ప్రారంభోత్సవ ఫలకాలు,శంకుస్థాపన ఫలకాలలో హిందూ మాసాలు, (ఫాల్గుణ, కృష్ణ పక్షం/శుక్ల పక్షం వంటివి) తేదీ, సంవత్సరం తప్పనిసరిగా పేర్కొనాలని ఆదేశించారు.
భవిష్యత్‌లో జారీ చేసే నోటిఫికేషన్‌లు, శంకుస్థాపన ఫలకాలు, ప్రారంభోత్సవ ఫలకాలు అన్నింటిలోనూ ఈ సంప్రదాయ కాలగణన ప్రమాణాలు ఉండేలా సాధారణ పరిపాలన శాఖకు ఈ విషయంలో అవసరమైన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
విక్రమ్ సంవత్ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో అంతర్భాగమని ముఖ్యమంత్రి అన్నారు. డెహ్రాడూన్‌లోని ఆదర్శ్ ఇండస్ట్రియల్ అటానమీ కోఆపరేటివ్ సొసైటీ దోయివాలా ఆధ్వర్యంలో నిర్వహించిన 'డ్రగ్స్ ఫ్రీ ఉత్తరాఖండ్' బైక్ ర్యాలీని సిఎం ధామి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు.