ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో జరిగిన కారు ప్రమాదంలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కుమారుడు క్షేమంగా బయటపడ్డారు. వివరాళ్లోకెళితే.. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కుమారుడు యోగేష్ కుమార్ మౌర్య శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా అలంపూర్ బైపాస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జలౌన్ జిల్లాలో యోగేష్ మౌర్య ఫార్చూనర్ కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఘటన జరిగిన వెంటనే కల్పి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
ఘటనపై పోలీసు సూపరింటెండెంట్ రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. "కల్పి సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కారు స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో యోగేష్ యాదవ్ ఉన్నట్లు ఎస్పీ ధృవీకరించారు. అయితే తనకు ఎలాంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది.