సివిల్స్ తుది ఫలితాల విడుదల.. సత్తాచాటిన తెలుగు అభ్యర్థులు

UPSC CSE 2020 final result declared. సివిల్స్‌-2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల

By Medi Samrat  Published on  24 Sept 2021 8:28 PM IST
సివిల్స్ తుది ఫలితాల విడుదల.. సత్తాచాటిన తెలుగు అభ్యర్థులు

సివిల్స్‌-2020 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్‌, 229 ఓబీసీ, 122 ఎస్సీ, 61 ఎస్టీ, 86 మంది ఈడబ్య్లూఎస్‌ కేటగిరి అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పి. శ్రీజకు 20వ ర్యాంకు రాగా.. మైత్రేయి నాయుడుకు 27వ ర్యాంకు వచ్చింది. జగత్‌ సాయికి 32వ ర్యాంకు దక్కింది. దేవగుడి మౌనికకు 75వ ర్యాంకు వచ్చింది. రవి కుమార్‌కు 84వ ర్యాంకు, యశ్వంత్‌ కుమార్‌ రెడ్డికి 93వ ర్యాంకు వచ్చింది.

సివిల్స్‌-2020 తుది ఫలితాల్లో ఐఐటీ బాంబే నుంచి బీటెక్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌) చేసిన శుభం కుమార్‌కు మొదటి ర్యాంకు సాధించాడు. భోపాల్‌ నిట్‌ నుంచి బీటెక్‌(ఎలక్రికల్‌ ఇంజనీరింగ్‌) చేసిన జాగృతి అవస్తికి రెండో ర్యాంకు వచ్చింది. మహిళల విభాగంలో అవస్తి టాపర్‌గా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది.


Next Story