ఉత్తరప్రదేశ్ మంత్రి, నిషాద్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ నిషాద్‌పై గోరఖ్‌పూర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మంత్రి సంజయ్ నిషాద్‌ను అరెస్టు చేసి ఆగస్టు 10లోగా తమ ముందు హాజరుపరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. జూన్ 7, 2015న జరిగిన ఆందోళనకు సంబంధించిన కేసులో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
సంజయ్ నిషాద్, అతని మద్దతుదారులు ప్రభుత్వ ఉద్యోగాల్లో నిషాద్‌లకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో సంజయ్ నిషాద్ జనాలను రెచ్చగొట్టారని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.