ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధిస్తే సంబరాలు చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు పెడతామంటూ హెచ్చరించారు. టీ20 వరల్డ్‌కప్‌లో అక్టోబర్ 24న టీమిండియాపై పాకిస్తాన్ గెలుపొందింది. అనంతరం పాక్ గెలుపుతో కశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు.. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని ఆగ్రాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు విద్యార్థులపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. దేశానికి వ్యతిరేకంగా విద్యార్థుల చేసిన నినాదాలకు నిరసనగా పలు హిందూ సంస్థలు సభ్యులు కళాశాల క్యాంపస్‌లో వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని అక్కడున్న కళాశాల ప్రొఫెసర్లు తెలిపారు. టీ20లో టీమిండియాపై పాకిస్తాన్ గెలుపు అనంతరం ఆగ్రా, బరేలి, బదౌన్, సీతాపూర్ జిల్లాల్లో కొందరు సంబరాలు జరుపుకున్నారు. వారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్టోబర్ 24న జరిగిన టీ20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ పోలీసులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం తెలిపింది. "పాకిస్తాన్ విజయాన్ని జరుపుకునే వారు దేశద్రోహ ఆరోపణలను ఎదుర్కొంటారు: సిఎం యోగి ఆదిత్యనాథ్" అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిఎంఓ ట్వీట్‌లో పేర్కొంది. ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.