భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు

భార్యతో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది.

By Medi Samrat  Published on  4 May 2024 5:16 AM GMT
భార్యతో అసహజ శృంగారం అత్యాచారం కాదు

భార్యతో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. వైవాహిక అత్యాచారం భారతీయ చట్టంలో గుర్తించబడదని.. అలాంటి సందర్భాలలో ఆమె సమ్మతి అసంబద్ధం అవుతుంది కాబట్టి, తన భార్యతో అసహజ సెక్స్‌లో నిమగ్నమవ్వడం అత్యాచారం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఒక వ్యక్తి తనతో అనేక సందర్భాల్లో అసహజ లైంగిక సంబంధం కలిగి ఉన్నాడని ఆరోపిస్తూ అతని భార్య చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కోర్టు రద్దు చేసింది. 2019 నాటి కేసులో బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

భర్త తనతో పలుమార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడని ఓ మహిళ 2019లో కేసు పెట్టింది. దీంతో ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ మహిళ భర్త మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. సెక్షన్ 377 ప్రకారం, భార్యాభర్తల మధ్య అసహజ శృంగారం అత్యాచారం కింద పరిగణించలేమని అతడి లాయర్ తెలిపారు. ‘‘ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం, భార్యతో భర్త శృంగార చర్య అత్యాచారం కిందకు రాదు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా భారతీయ చట్టాలు ఇంకా గుర్తించలేదు. భార్యతో భర్త అసహజ శృంగారం నేరం కాదని సెక్షన్ 377 చెబుతోంది’’ అని న్యాయమూర్తి తెలిపారు. అయితే, సెక్షన్ 376బీ ప్రకారం విడిగా ఉంటున్న భార్యతో ఆమె అనుమతి లేకుండా శృంగారం అత్యాచారమేనని తెలిపారు. ఈ కేసులో ఐపిసి సెక్షన్ 376 బి మాత్రమే మినహాయింపు అని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు 2019 నాటిది, ఇందులో ఒక భార్య తన భర్తపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. భర్త తనతో అనేక సందర్భాల్లో అసహజ లైంగిక చర్యలకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ భర్త మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి దానిని రద్దు చేయాలని అభ్యర్థించారు.

Next Story