Video : కేంద్ర మంత్రి కుమార్తెకు వేధింపులు.. కార్యకర్తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి..

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో తన కుమార్తె, ఆమె స్నేహితులను కొంతమంది అబ్బాయిల బృందం వేధింపులకు గురిచేసినందుకు కేంద్ర యువజన వ్యవహారాల సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆదివారం, మార్చి 2 నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By Medi Samrat
Published on : 2 March 2025 8:42 PM IST

Video : కేంద్ర మంత్రి కుమార్తెకు వేధింపులు.. కార్యకర్తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి..

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో తన కుమార్తె, ఆమె స్నేహితులను కొంతమంది అబ్బాయిల బృందం వేధింపులకు గురిచేసినందుకు కేంద్ర యువజన వ్యవహారాల సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆదివారం, మార్చి 2 నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జల్గావ్ జిల్లాలో జరిగిన ఒక ఫెస్టివల్ లో తన మైనర్ కుమార్తెను వేధించడంతో మహారాష్ట్రలో మహిళా భద్రతపై కేంద్ర మంత్రి ప్రశ్నలు లేవనెత్తారు. రక్షా ఖడ్సే పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. "నేను కేంద్ర మంత్రిగా, ఎంపీగా కాకుండా న్యాయం కోరే తల్లిగా వచ్చాను" అని ఖడ్సే మీడియాతో చెప్పారు.

ముక్తైనగర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుషానత్ పింగ్డే మాట్లాడుతూ.. నిందితులు పలువురు బాలికలతో అనుచితంగా ప్రవర్తించారని, బాలిక అంగరక్షకులతో కూడా గొడవ పడ్డారని చెప్పారు. ఈ కేసులో ఏడుగురిని నిందితులుగా తెలిపిన పోలీసులు, వారిలో ఒకరిని అరెస్టు చేశారు.

Next Story